ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనుష్ 'తిరుచిత్రంబలం' OTT విడుదల తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 01:25 PM

మిత్రన్ ఆర్ జవహర్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'తిరుచిత్రంబళం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. ఈ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ చేయబడింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబర్ 23, 2022న సన్ NXTలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని సమాచారం. ఈ చిత్రం తమిళం మరియు తెలుగు వెర్షన్‌లతో పాటు మలయాళం మరియు కన్నడ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది అని మేకర్స్ ప్రకటించారు. 


ఈ చిత్రంలో నిత్యా మీనన్ మరియు రాశి ఖన్నా కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, భారతీరాజా, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com