ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ (58) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. జిమ్ లో వర్కవుట్ చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి రావడంతో శ్రీవాస్తవ ఆగస్టు 10న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన విషయం తెలిసిందే. పలు బాలీవుడ్సి నిమాల్లో నటించిన ఆయన స్టాండ్-అప్ కమెడియన్ గా కూడా ప్రేక్షకులను మెప్పించారు.