మచ్ ఎవైటెడ్ AK 61 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ పై బిగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో జోరుగా సర్క్యూలేట్ అవుతుంది. ఈ రోజు సాయంత్రం ఆరు దాటిన తరవాత AK 61 ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రివీల్ కానున్నాయని టాక్. ఈ మేరకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
హెచ్ వినోద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో అజిత్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి.
ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అజిత్ అభిమానులు నిరాశలో మునిగిపోగా, లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త వారిలో ఖుషిని నింపుతుంది.