మణిరత్నం డైరెక్షన్లో 'పొన్నియిన్ సెల్వన్' అనే నవల ఆధారంగా అదే టైటిల్ తో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ మూవీ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 23వ తేదీన సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్లోని JRC కన్వెన్షన్స్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.
పోతే, ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, కార్తీ, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పిస్తున్నారు.