యంగ్ హీరో విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటుంది. లేటెస్ట్ గా వచ్చిన డబుల్ ధమాకాతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా.
డబుల్ ధమాకా ఏంటి అనుకుంటున్నారా.... విక్టరీ వెంకటేష్ రోల్ పై మేకర్స్ సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. అందరు అభిమానించే వెంకీ మామ అల్ట్రా స్టైలిష్ అవతార్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారంటూ ప్రకటించింది. మరొక సర్ప్రైజ్ ఏంటంటే, ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. విడుదలైన గ్లిమ్స్ వీడియోలో వెంకటేష్ స్టైలిష్ అవతార్ విశేషంగా ఆకట్టుకుంటుంది.
పోతే, ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు డైరెక్టర్ కాగా, మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది. పీవీపీ సినిమాస్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.