సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుతో కలిసి నటించిన "కొడుకు దిద్దిన కాపురం" నేటితో 33 ఏళ్ళను పూర్తి చేసుకుంది. 21 సెప్టెంబర్, 1989 లో విడుదలైన ఈ మూవీలో మహేష్ తొలిసారిగా డ్యూయల్ రోల్ లో నటించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సీనియర్ నటులు గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాను కృష్ణ గారే డైరెక్ట్ చేసారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణగారే ఈ సినిమాను నిర్మించారు. రాజ్ కోటి సంగీతం అందించారు.