తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ శాతం హీరోలు అందరూ తెలుగు వారు కావడంతో వారి పాత్రలకు వారే డబ్బింగ్ చెప్పుకుంటారు. కానీ, హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి అలా ఉండదు... ఎందుకంటే, మన దర్శకనిర్మాతలు మన తెలుగు అమ్మాయిల కన్నా.. పక్క రాష్ట్రాల హీరోయిన్లపైనే మక్కువ చూపిస్తుంటారు.
లేటెస్ట్ గా టాలీవుడ్ కు దిగుమతి ఐన హీరోయిన్ షెర్లీ సెటియా.. బాలీవుడ్ సింగర్ కం యాక్ట్రెస్ ఐన ఈమె తెలుగులో "కృష్ణ వ్రింద విహారి" సినిమాతో డెబ్యూ చేయబోతుంది. ఇందులో నాగశౌర్య హీరో కాగా, సెప్టెంబర్ 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా కోసం షెర్లీ కష్టపడి తెలుగు డబ్బింగ్ చెప్పిందట. నిజానికి షెర్లీకి హిందీ కూడా రాదు.. ఎందుకంటే ఆమె స్వస్థలం న్యూజిలాండ్ మరి. సినిమాపై ఆమె కమిట్మెంట్ కు జోహార్లు చెప్పాల్సిందే.