బాలీవుడ్ నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఈ రోజు ఉదయం కన్ను మూశారు. గుండెపోటుతో గత నెల్లో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలలో చేరిన రాజు అప్పటి నుండి చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. అకస్మాత్తుగా ఈ రోజు ఉదయం చివరి శ్వాసను విడిచి, నింగికేగారు.
మైనే ప్యార్ కియా, బాజీగర్, మైనే ప్రేమ్ కి దివాని హూ, బిగ్ బ్రదర్, బాంబే టు గోవా, టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కధ చిత్రాలలో నటించిన రాజు, మంచి ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. రాజు ఆకస్మిక మరణం తెలుసుకున్న బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.