నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న పదహారవ చిత్రం "హంట్". మహేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్, భరత్ నివాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
మోహన్ భార్గవ్ రోల్ లో శ్రీకాంత్ నటిస్తున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపిన మేకర్స్ భరత్ నివాస్ 'దేవ్' అనే పాత్రలో నటించబోతున్నట్టు తెలిపారు. దేవ్ గా భరత్ క్యారెక్టర్ పోస్టర్ ను రివీల్ చేసారు. భరత్ నివాస్ ఎవరో కాదు... 2004లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ఐన 'ప్రేమిస్తే' మూవీ హీరో. దాదాపు పదేళ్ల విరామం తదుపరి తెలుగులో భరత్ నటిస్తున్న చిత్రమిదే.
ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.