బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "స్వాతిముత్యం". లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది.
దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన విడుదల కాబోతున్న ఈ మూవీ నుండి కొంచెంసేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం 11:07 గంటలకు స్వాతిముత్యం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు.
PDV ప్రసాద్ సమర్పిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.