యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.
శ్రీముఖి గత ఏడాది 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా శ్రీముఖి బ్లాక్ గౌనులో మైమరపించే ఫోజులు ఇచ్చింది. పొట్టిగా ఉన్న ఆమె గౌనులో ఎద పరువాలు, థైస్ అందాలు విజువల్ ట్రీట్ లాగా మారాయి.
#sreemukhi pic.twitter.com/J1MtwHGqBW
— Actress gallery (@Actressgaller18) September 24, 2022