రెబల్ స్టార్ ప్రభాస్ కు పాన్ ఇండియా క్రేజ్ ను, పాన్ ఇండియా ట్యాగ్ ను తీసుకొచ్చిన మూవీ "బాహుబలి". రాజమౌళి డైరెక్షన్లో రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ మూవీ గ్లోబల్ లెవెల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే.
ఐతే, ఈ మూవీపై హీరో కార్తీ పొన్నియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కీలక వ్యాఖ్యలు చేసారు. మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్" ప్రకటింబపడిన దగ్గర నుండి తమిళ బాహుబలి అని పోల్చబడుతూ వస్తుంది. ఆ వ్యాఖ్యలపై కార్తీ మాట్లాడుతూ... బాహుబలిని దేశప్రజలందరూ చూసారు. దిగ్విజయం చేశారు. ఇప్పుడు మరో బాహుబలి రాక అవసరం లేదు. మనం ఇండియాలో పుట్టాం.. ఈ గడ్డ మీద ఎందరో వీరులు ఈ దేశంలో పుట్టారు. దేశప్రజలందరికి వారి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. డెబ్బై ఏళ్లుగా బెస్ట్ సెల్లింగ్ బుక్ గా అమ్ముడవుతున్న పొన్నియిన్ సెల్వన్ ను మూవీగా చూడాలనుకోవడం మణిరత్నంగారి కల. ఆయన కలలో భాగం కావడం నిజంగా గొప్ప... అంటూ చెప్పుకొచ్చారు. పోతే, ఈ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.