ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ చిత్రం "ఆదిపురుష్". బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
షూటింగ్ గతేడాదిలోనే పూర్తయినా, అప్పటి నుండి ఇప్పటివరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులనే జరుపుకుంటుంది ఈ సినిమా. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. దసరా కానుకగా ఆదిపురుష్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల కాబోతున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జారుతుంది. ఫ్యాన్స్ కూడా వేకళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ విషయంపై మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ విషయం పక్కన పెడితే, జనవరి 2023లో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం ప్రభాస్ ఏకంగా నెలరోజుల సమయాన్ని కేటాయించారని వినికిడి. అక్టోబర్, నవంబర్ నెలల్లో సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్ లను నిర్విరామంగా జరిపి, ఆపై డిసెంబర్ నెలలో పూర్తిగా షూటింగ్ లన్నింటికీ బ్రేక్ ఇచ్చారని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa