మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'గాడ్ ఫాదర్'. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్ బుధవారం రాత్రి 8 గంటలకు విడుదల చేస్తునట్టు చిత్రబృందం తెలిపింది. అయితే రేపు అనంతపూర్ లోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa