ఓ… ఓ ఓహో… ఓ
ఓ… ఓ ఓహో…
పల్లవి:
తానే వచ్చిందనా
గాలే రంగుల్లో మారేనా
అరె పల్లె గాలి ఈ పిల్లై మారే
నను ఊపిరల్లె అల్లేనా
వీడి గుండె చాలే నా వల్లే కాదే
ఇది ముందు లేని యాతన
విడిచే యుగమైనా
కలిసే క్షణమవదా
విడిగా నేనున్నా
ఎదలో ఒదిగున్నా
అరె మచ్చైన మచ్చుకు లేని జాబిలి నేలకొచ్చినది
తడి ఎండిన గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచినది
అరె మచ్చైన మచ్చుకు లేని జాబిలి నేలకొచ్చినది
తడి ఎండిన గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచినది
నీవేలే…… నా దారి
వచ్చాలే…. నే కోరి….
చరణం :
వేకువే ఆగునా చీకటుందనీ
చినుకులే రాలవా దూరముందనీ
పువ్వులే పూయవా కొమ్మ అడ్డనీ
స్వప్నమే దాగునా నిదురలో అనీ
కనులే… తెరిచా
కలలో…… పిలిచా
నే….. గెలిచా..
నీకై….. నిలిచా
అరె రెప్పల దుప్పటి చాటు దాగిన ఘాటు వెన్నెలిది…
అరె గుప్పెడు గుండెల డప్పు చప్పుడు పెంచి వెళ్ళినది…
అరె రెప్పల దుప్పటి చాటు దాగిన ఘాటు వెన్నెలిది…
అరె గుప్పెడు గుండెల డప్పు చప్పుడు పెంచి వెళ్ళినది…
నీవేలే…. నా దారి…
వచ్చాలే….. నే కోరి……
ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలేల్లో
ఏలేల్లో ఏలేల్లో ఏలే ఏలేల్లో
తానతందననా తానతందననా తందననా తందననా తందననా