టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ కొత్త సినిమా ప్రకటన రీసెంట్ గా జరిగిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఈ రోజు నుండే రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేసింది.
సత్యదేవ్ నటిస్తున్న 26వ సినిమా ఇది. ఈ సినిమాలో కన్నడ నటుడు ధనంజయ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ పై బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటుల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.