శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా, తెలుగు డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కిస్తున్న చిత్రం "ప్రిన్స్". తెలుగు, తమిళ భాషలలో ఈ దీపావళికి థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ గా బిగ్ అప్డేట్ వచ్చింది.
అదేంటంటే, ఫైనల్ సాంగ్ షూటింగ్ లో ఉన్న చిత్రబృందం ఈ రోజుతో మొత్తం షూటింగ్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్రబృందం కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు.
పోతే, ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.