పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా అక్టోబర్ మూడో వారంలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌కు సంబంధించి ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్ నిర్వహించి దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ పాన్ ఇండియా సినిమాని ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు.