కోలీవుడ్ నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ తాజా చిత్రం “పొన్నియిన్ సెల్వన్”. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం తొలి భాగం నిన్న పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. ఈ భారీ చిత్రంలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష ఐశ్వర్యరాయ్ కీలక పాత్రలు పోషించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ కూడా నిర్మించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బజ్ తో విడుదలైన ఈ సినిమా నైజాంలో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అక్కడ ఈ సినిమా మొదటి రోజు 2.3 కోట్ల షేర్ సాధించింది. అలాగే వేరే సినిమాలేవీ లేకపోవడంతో వీకెండ్ కలెక్షన్స్ కూడా మెరుగ్గా రావచ్చు.
![]() |
![]() |