ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గారు తాజాగా అల్లు స్టూడియోస్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో నిర్మితమవుతున్న ఈ స్టూడియోస్ ఈ రోజే గ్రాండ్ గా ఓపెన్ అయ్యింది. ముందుగా అనుకున్నట్టుగానే ఈ స్టూడియోస్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతులమీదిగా గ్రాండ్ లాంచ్ అయ్యింది. దీంతో చాలా రోజుల తరవాత మామ అల్లుళ్లను(చిరు- బన్నీ) ఒకే ఫ్రేమ్ లో చూసే అదృష్టం దక్కింది ప్రేక్షకులకు. అలానే చిరు, ఆయన సతీమణి సురేఖ గారు అల్లు రామలింగయ్యగారి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలను వేశారు.
అక్టోబర్ 1వ తేదీన అంటే ఈ రోజు అల్లు రామలింగయ్య గారి శతజయంతి సందర్భంగా, ఆయన మధుర స్మృతిగా ఈ స్టూడియోస్ ను ప్రారంభించారు. పోతే, ఈ గ్రాండ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa