ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని లాక్ చేసిన రాఘవ లారెన్స్ 'రుద్రుడు'

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 09:23 PM

కతిరేసన్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్‌ ఒక యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి 'రుద్రుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజగా మూవీ మేకర్స్ ఈ చిత్రం వేసవిలో ఏప్రిల్ 14, 2023న థియేటర్లలోకి రానుంది అని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. లారెన్స్ సరసన జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్నినిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa