ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హీరోయిన్ కరీనా కపూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ అభిమాని సెల్ఫీల కోసం ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో కరీనా కపూర్ ఖాన్ భయపడి, అసౌకర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. కరీనా సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని దూరంగా నెట్టేశారు. ఎయిర్‌పోర్టులో కరీనా కనిపించగానే ఆమెతో ఫొటోలు దిగేందుకు అభిమానులు చుట్టిముట్టినప్పుడు ఇలా జరిగింది.