నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటించిన "ది ఘోస్ట్" మూవీ దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో ఘోస్ట్ జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.
నైజాం - 5.5కోట్లు, సీడెడ్ - 2.5 కోట్లు, ఆంధ్ర - 8 కోట్లు మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో - పదహారు కోట్లు, కర్ణాటక - 65లక్షలు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా - రెండు కోట్లు, ఓవర్సీస్ - రెండున్నర కోట్లు .... ప్రపంచవ్యాప్తంగా ఘోస్ట్ మూవీ ఇరవై ఒకటిన్నర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్నట్టు తెలుస్తుంది.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa