తమిళ నటుడు అశోక్ సెల్వన్ హీరోగా, రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఆకాశం". వయోకాం 18 స్టూడియోస్ తో కలిసి శ్రీనిధి సాగర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ దర్శకత్వం చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
టీజర్ తో ప్రేక్షకుల హృదయాలను దోచిన ఈ మూవీ లేటెస్ట్ గా విడుదల తేదీ ఖరారు చేసుకుంది. నవంబర్ 4వ తేదీన తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. పోతే, తమిళంలో "నితం ఒరు వానం" టైటిల్ తో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa