బి అఖిల్ రెడ్డి, రాశి సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం "పొగరున్నోడు". పద్మరాజు ఎన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. AK టాకీస్ బ్యానర్ పై సోమరాజు కళ్యాణి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లిమ్స్ ను దసరా కానుకగా రేపు ఉదయం 09:09 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు మూవీ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పోతే, ఈ సినిమాతోనే హీరో అఖిల్ రెడ్డి టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కాబోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa