టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ తెలుగు ఓటిటి ఆహాలో హోస్ట్ చేసిన టాక్ షో "అన్ స్టాపబుల్ విత్ NBK" ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వాస్తవానికి ఈ షో నుండే ఆహా సబ్స్క్రైబర్స్ పెరగడం, షో ముగిసిన వెంటనే సబ్స్క్రైబర్స్ కూడా తగ్గడం జరిగిందని ఒక వార్త చెలామణిలో ఉంది. ఈ విషయం పక్కన పెడితే, ఈ షో పాపులారిటీని గమనించిన బాలయ్య టీం హోస్ట్ గా వ్యవహరించేందుకు సెకండ్ సీజన్ కు పది కోట్లను కోట్ చేసారంట. విశేషమేంటంటే, ఫస్ట్ సీజన్ కి రెండున్నర కోట్లను పారితోషికంగా పొందిన బాలయ్య సెకండ్ సీజన్ కి అమాంతం ఏడున్నర కోట్లను పెంచేసి, పది కోట్లను డిమాండ్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.