చిత్రం : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
నటీనటులు : అల్లరి నరేష్ , ఆనంది,
గాత్రం : జావేద్ అలీ
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సాహిత్యం : శ్రీమణి
ఏలే... ఎల్లె లే ఏలే ... ఏలే ఎల్లె లేలే
ఏలే... ఎల్లె లే ఏలే ... ఏలే ఎల్లె లేలే
పల్లవి :
నా తెలుగు భాషలో... కొత్త అక్షరం నువ్వా
నా చేతి గీతలో ... కొత్త రేఖవైనావా
మట్టి తెగలో దాచిపెట్టిన చందమామవే నువ్వా
చిట్టి గుండెనే చిన్ని కొంగుకే చుట్టుకెళ్ళినావా
హుక్ లైన్స్ :
ఏ లచ్చిమి ... నీ ఎనకఎనక వస్త.. కనకలచ్చిమి
మనకి రాసి పెట్టి ఉంది గనక లచ్చిమి
ఇంక ముందు ఎనక సూడక మనసుతో మాటలాడమ్మీ
చరణం - 1:
ఆ గోదారి అందమే
దారి తప్పిలా నా దారికొచ్చెనే ...
ఈ మందారపువ్వుతో మాటలాడిలా
నా మనసు మురిసెనే
అమ్మోమ్మో మాటలా అవి
ఇళయరాజాగారి పాటలా
నా గుండె తబలానిలా
జాకీర్ హుస్సేన్ లా వాయించాలా
హుక్ లైన్స్ :
ఏ లచ్చిమి ... నీ ఎనకఎనక వస్త.. కనకలచ్చిమి
మనకి రాసి పెట్టి ఉంది గనక లచ్చిమి
ఇంకా ముందు ఎనక సూడక మనసుతో మాటలాడమ్మీ
చరణం - 2:
చిటారు కొమ్మపై
మిఠాయి పోట్లమే
నాగుండెలో గిటారు మీటెనే
చిరాకు రేగితే
ఆ మూతి ముడుపులే
పటాకు పేలుడే
అమ్మోమ్మో కులుకులా అవి
కూచిపుడినే మించిపోయేలా
ఓలమ్మా నడకలా అవి
నెమలి నాట్యాన్నే మురిపించేలా
హుక్ లైన్స్ :
ఏ లచ్చిమి ... నీ ఎనకఎనక వస్త.. కనకలచ్చిమి
మనకి రాసి పెట్టి ఉంది గనక లచ్చిమి
ఇంకా ముందు ఎనక సూడక మనసుతో మాటలాడమ్మీ