ట్రైలర్ లో హిలేరియస్ కామెడీని పండించి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను ఏర్పరిచిన చిత్రం "జిన్నా". మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
పెంచలయ్యగా సునీల్ ను పరిచయం చేసిన చిత్రబృందం తాజాగా మైసూరు బుజ్జి పాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ మైసూరు బుజ్జి పాత్రలో నటిస్తూ, హిలేరియస్ కామెడీని పండించబోతున్నారని తెలుపుతూ, ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేసారు.
ఇషాన్ సూర్య డైరెక్షన్లో హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.