నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మి స్పష్టతనిచ్చారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో తన సోదరుడి పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మనోజ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఆయన త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?'' అని విలేకరి ప్రశ్నించగా.. ''ఎవరి బతుకు వాళ్లని బతకనివ్వండి. ఇప్పుడున్న రోజుల్లో నిస్వార్థమైన, నిజాయతీ కలిగిన ప్రేమను పొందడం చాలా కష్టం. మనోజ్ అలాంటి ప్రేమను పొందుతున్నదుకు నేనెంతో ఆనందిస్తున్నా. అతనికి ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి'' అని ఆమె వివరించారు.