కన్నడ చిత్రపరిశ్రమ నుండి వచ్చిన కేజీఎఫ్ 1,2 చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది,
తాజాగా కన్నడ చిత్రపరిశ్రమని షేక్ చేస్తున్న మూవీ "కాంతార". ఇటీవలే విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో పాటు, అద్దిరిపోయే రివ్యూలను అందుకుంటుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తున్న అమేజింగ్ రెస్పాన్స్ కారణంగా తెలుగులో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సంస్థ కాంతార తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చెయ్యగా, అక్టోబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ తెలుగు ట్రైలర్ ను విడుదల చేసారు. అడవి నేపథ్యంలో జరిగే విభిన్న యాక్షన్ డ్రామాగా సాగిన ట్రైలర్ సినిమాపై తగిన బజ్ క్రియేట్ చేసింది.