అక్టోబర్ 9వ తేదీన అంటే ఈ రోజు "ప్రిన్స్" ట్రైలర్ విడుదల కాబోతుందన్న విషయం తెలిసిందే కదా. తాజా సమాచారం ప్రకారం, ప్రిన్స్ తెలుగు ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ రోజు విడుదల చెయ్యనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తొలిసారి నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రమిది. ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ అనుదీప్ కేవీ డైరెక్ట్ చేస్తుండగా, మరియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. దీపావళి కానుకగా, ఈ నెల 21వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.