తెలుగు ప్రేక్షకాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "అన్ స్టాపబుల్ విత్ NBK S 2" అక్టోబర్ 14వ తేదీ నుండి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయ్యింది. ఈ విషయాన్ని అధికారికంగా పేర్కొంటూ మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసారు.
ప్రశ్నల్లో మరింత ఫైర్... ఆటల్లో మరింత డేర్... సరదాల్లో మరింత సెటైర్... మీకోసం మరింత రంజుగా... అని బాలయ్య చెప్పే డైలాగులు ప్రేక్షకులలో ఫుల్ ఖుషిని నింపుతున్నాయి.
పోతే, ఈ షో మొదటి ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్ గా రానున్నారు.