పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతితో ఒక సినిమాను చెయ్యనున్నాడన్న విషయం ఎప్పటి నుండో వార్తల్లో హాట్ టాపిక్ గా ఉంటూనే ఉంది. ఐతే, ఈ విషయంపై అటు ప్రభాస్ టీం కానీ, మేకర్స్ కానీ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకపోవడం అభిమానులను కన్ఫ్యూషన్ లోకి నెట్టేసింది.
తాజాగా ఈ సినిమా మరొకసారి వార్తల్లో నిలిచింది. ఎందుకంటే, ఈ దీపావళి పూర్తయ్యేలోపే ప్రభాస్ మారుతి డైరెక్షన్లో చెయ్యబోయే సినిమాకు సంబంధించి ఒక షార్ట్ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారంట. నటీనటుల విషయానికొస్తే, బాలీవుడ్ విలక్షణ నటుడు సంజయ్ దత్, కోలీవుడ్ హీరోయిన్ మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ ను లాక్ చేసారంట. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో అధికారికంగా తెలియాల్సి ఉంది.