మెగాస్టార్ చిరంజీవి నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా "గాడ్ ఫాదర్" దసరా కానుకగా థియేటర్లలో విడుదలై ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో తెలిసిందే.
అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమాకు అన్నివర్గాల ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ముందుగా ఈ సినిమాను మలయాళంలో కూడా విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్ పై ఆ నిర్ణయాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు. అలానే తమిళ్ లో గాడ్ ఫాదర్ విడుదలవుతుందని కూడా ప్రకటించారు.
తాజాగా తమిళంలో గాడ్ ఫాదర్ విడుదలయ్యేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అక్టోబర్ 16 నుండి కోలీవుడ్ బాక్సాఫీస్ ని కొల్లగెట్టేందుకు గాడ్ ఫాదర్ రెడీ అవుతున్నారు. మరి, తమిళ ప్రేక్షకులను గాడ్ ఫాదర్ ఏమేరకు అలరిస్తారో చూడాలి.