మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆయన పెంచుకునే రైమ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. రాంచరణ్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పిక్స్ లో ఎక్కువశాతం రైమ్ కూడా ఉంటుంది.
తాజాగా రైమ్ తో చెర్రీ దిగిన పిక్ సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తుంది. ఈ పిక్ లో రైమ్ ఎంతో క్యూట్ గా ఉంటే, చెర్రీ అంతకన్నా స్వీట్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు.
చెర్రీ లుక్ చూస్తుంటే, RC 15లో ఉండబోయే ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన లుక్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే, రేపటి నుండే రాజమండ్రిలో RC 15 న్యూ షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతుంది మరి. ఈ పిక్ బయటకు రావడంతో, చెర్రీ పై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తారని అంటున్నారు.