సినీరంగప్రవేశం చేసిన అనతికాలంలోనే నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకున్న కన్నడ భామ రష్మిక మండన్నా. పుష్ప సినిమా ఇచ్చిన ఊపుతో హిందీలో వరసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె బాలీవుడ్ డిబట్ మూవీ "గుడ్ బై" రెండ్రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మంచి రివ్యూలైతే వస్తున్నాయి కానీ, కలెక్షన్లే డల్ గా సాగుతున్నాయి.
ఈ విషయం గురించి పక్కన పెడితే, నిన్ననే అమ్మడు మాల్దీవ్స్ వెకేషన్ కెళ్ళింది. ఈ వెకేషన్ ను విజయ్ దేవరకొండ తో కలిసి ఎంజాయ్ చేస్తుందని చాలా మంది సందేహం. ఈ విషయం గురించి పక్కన పెడితే, అక్కడి అందమైన ప్రదేశాలలో తిరుగుతూ రష్మిక బాగా ఎంజాయ్ చేస్తుందట. ఈ మేరకు ఆమె స్విమ్మింగ్ పూల్ లో తనను తానే మైమరచి సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తున్న పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.