హైదరాబాద్ అమ్మాయి నిధి అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరు చూపిస్తుంది. వేగంగా సినిమాలు చెయ్యటం కన్నా, మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాలను నెమ్మదిగా చెయ్యటమే మిన్న పాలిసీ ఫాలో అవుతూ ఈ తరం హీరోయిన్లలో కాస్త భిన్నంగా ఆలోచించే హీరోయిన్ నిధి.
ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా డిబట్ ప్రాజెక్ట్ "హరిహర వీరమల్లు" లో లీడ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన నిధి తాజాగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సరసన కూడా నటించే అవకాశం కొట్టేసిందని సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తుంది.
మారుతీ - ప్రభాస్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కబోతుందనే ప్రచారం గురించి అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ లో నిధి అగర్వాల్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు సమాచారం. నిధితో పాటు కోలీవుడ్ హీరోయిన్ మాళవికా మోహనన్ కూడా మరొక హీరోయిన్ గా నటించబోతుందట. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ, ఇదేగనక నిజమైతే, ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్లతో అదికూడా పాన్ ఇండియా సినిమాలలో నటించే అరుదైన అవకాశాన్ని నిధి కొట్టేసినట్టే.