ఇండియన్ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం గారు ఆయన డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన చిత్రం "పొన్నియిన్ సెల్వన్". సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది.
ముఖ్యంగా తమిళ నాట ఈ మూవీ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అదేవిధంగా ఓవర్సీస్ లోనూ పొన్నియిన్ సెల్వన్ బిగ్ నాయిస్ చేస్తుంది. తాజాగా USA లో 5. 5 మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో 2.O ను బీట్ చేసేసి, ఆల్ టైం నెంబర్ వన్ కోలీవుడ్ మూవీగా సెన్సేషనల్ రికార్డును సొంతం చేసుకుంది.
పోతే, ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ప్రకాష్ రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్ తదితరులు నటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతం అందించారు.