మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన చిత్రం "ఉప్పెన". ఈ సినిమా కేవలం వైష్ణవ్ కి మాత్రమే ఫస్ట్ మూవీ కాదు, డైరెక్టర్ బుచ్చిబాబు సానాకి, హీరోయిన్ కృతిశెట్టికి కూడా డిబట్ మూవీనే.
గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వైష్ణవ్ తొలి సినిమాతోనే వంద కోట్ల గ్రాస్ క్లబ్ హీరోల్లోకి చేరిపోయాడు. ఉప్పెన బ్యూటీగా కృతిశెట్టి వరస సినిమా అవకాశాలను కొట్టేసింది.
తాజాగా ఈ సినిమా ఫిలింఫేర్ అవార్డుల్లోనూ సత్తా చాటింది. ప్రేక్షకుల మనసులను దోచిన ఆసి, బేబమ్మ (సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రల పేర్లు) ఇద్దరూకూడా ఫిలింఫేర్ బెస్ట్ డిబట్ హీరోహీరోయిన్లుగా అవార్డులను అందుకున్నారు.