చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్‌ఫాదర్' చిత్రం రూపొందింది. తమిళంలో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అన్ని చోట్లా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. నైజాంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా 5వ రోజు కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. గాడ్ ఫాదర్ నైజాంలో 5వ రోజు రూ.2.9 కోట్లు వసూలు చేసింది. షేర్ చూస్తే.. రూ. 1.5 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా నైజాంలో మొత్తం 5 రోజులకు గాను రూ.10.3 కోట్ల షేర్ వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.