మెగాస్టార్ చిరంజీవి గారికి ఆచార్య వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తదుపరి గాడ్ ఫాదర్ రూపంలో సరైన బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గారు గాడ్ ఫాదర్ సినిమాను చూసి చిత్రబృందాన్ని మొత్తం అభినందించారని డైరెక్టర్ మోహన్ రాజా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎక్సెలెంట్, వెరీ నైస్, వెరీ ఇంటరెస్టింగ్... వంటివి రజిని ఇచ్చిన ప్రశంసల్లో కొన్ని. తెలుగు వెర్షన్ లో చేసిన మార్పులు చేర్పులు చాలా బాగున్నాయి. అంటూ రజిని గాడ్ ఫాదర్ ను తెగ మెచ్చుకున్నారంటూ మోహన్ రాజా ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా రాజా రజినీకి కృతజ్ఞతలను తెలిపారు.
మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కింది గాడ్ ఫాదర్. ఇందులో నయనతార, సత్యదేవ్, సముద్రఖని, సునీల్, షఫీ, దివి, తదితరులు కీలకపాత్రలు పోషించారు.