టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి ఇటీవలే విడుదలైన చిత్రం "నేను మీకు బాగా కావాల్సిన వాడిని". ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా వెండితెరపై మాత్రం మ్యాజిక్ చెయ్యలేకపోయింది. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెలరోజుల తేడాతో డిజిటల్ స్ట్రీమింగ్ కొచ్చేందుకు రెడీ అవుతుంది. అంటే అక్టోబర్ 14 నుండి నేను మీకు బాగా కావాల్సినవాడిని మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. విశేషమేంటంటే, ప్రైమ్ వీడియో, ఆహా రెండు ఓటిటీలలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ శంకర్ డైరెక్టర్. కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా, కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మింపబడిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.