కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన కొత్త మూవీ సర్దార్. ఈ సినిమా నుండి నిన్ననే ఫస్ట్ లిరికల్ "సేనాపతి నేనే" సాంగ్ విడుదలైంది. ఈ పాటలో కార్తీ విభిన్న గెటప్స్ లో కనిపిస్తారు. చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తుంది. అలానే అనురాగ్ కులకర్ణి గాత్రం మరింతగా ఆకట్టుకుంటుంది.
PS మిత్రన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోతే, ఈ సినిమాలో కార్తీ ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ స్పై గా నటించబోతున్నారు.
దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని S లక్ష్మణ్ కుమార్ నిర్మించారు.