భారతదేశపు అత్యుత్తమ దిగ్గజ నటుల్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒకరు. నేడు అమితాబ్ 80వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అశేష ప్రేక్షకాభిమానులు అమితాబ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతూ, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నారు.
70, 80లలో అమితాబ్ అంటే జనాలలో విపరీతమైన క్రేజ్ ఉండేది. బిగ్ బి, స్టార్ ఆఫ్ ది మిలీనియం, యాంగ్రీ యంగ్ మాన్, షెహన్షా అఫ్ బాలీవుడ్ అని అమితాబ్ ను అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారు.
1973లో జయబాధురిని వివాహమాడిన అమితాబ్ కు ఇద్దరు సంతానం. కుమార్తె శ్వేతా బచ్చన్ నందా, కుమారుడు అభిషేక్ బచ్చన్. అభిషేక్ సినిమాలలో జూనియర్ బచ్చన్ గా పేరు తెచ్చుకున్నారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ అభిషేక్ ను వివాహమాడి బచ్చన్ ఫ్యామిలీకి కోడలిగా మారిన విషయం తెలిసిందే.