నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న హంట్ మూవీ నుండి కొంచెంసేపటి క్రితమే పటాకా సాంగ్ ఆఫ్ ది ఇయర్ "పాపతో పైలం" లిరికల్ వీడియో విడుదలైంది. గిబ్రాన్ పెప్పి మ్యూజిక్, కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్, నాకాష్ అజీజ్, మంగ్లీల గానం... కలగలిపిన ఈ పాటకు సుధీర్, అప్సరా రాణి వేసే అమేజింగ్ స్టెప్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మహేష్ డైరెక్షన్లో అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్, కోలీవుడ్ యంగ్ హీరో భరత్ నివాస్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవలే విడుదలైన టీజర్ డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.