ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓరి దేవుడా : విడుదలకు సిద్ధమైన 'అనిరుధ్' పాడిన పాట..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 11, 2022, 11:48 AM

కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ స్వయంగా ఆలపించిన ఓరి దేవుడా చిత్రంలోని "గుండెల్లోనా" అనే పాట ఈ రోజు సాయంత్రం 05:04 గంటలకు విడుదల కాబోతుంది. విశ్వక్ సేన్, ఆశా భట్ వానలో తడుస్తూ డాన్స్ చేసే ఈ పాట పూర్తి వీడియో రూపంలో విడుదల కాబోతుంది. ఐతే, అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించలేదు కానీ, ఈ పాట పాడడం విశేషం.


కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటరైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు.


ఆశా భట్ మరొక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com