శ్రీధర్ గాధే దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ రెండు OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో అక్టోబర్ 14, 2022న విడుదల కానుంది అని సమాచారం. మాస్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సంజనా ఆనంద్ మరియు సోనూ ఠాకూర్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలో ఎస్వీ కృష్ణా రెడ్డి, సమీర్, గౌతమ్ రాజు, బాబా భాస్కర్ మరియు ఇతరులు సహాయక పాత్రల్లో నటించారు. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.