బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ నరకలోకాధిపతిగా నటిస్తున్న చిత్రం "థాంక్ గాడ్". ఇందులో సిద్దార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్నారు.
కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. జీవితంలో ఎక్కువగా పాపాలు చేసిన సిద్దార్థ్ అనుకోకుండా మరణించి, నరకానికి వెళ్తాడు. అక్కడ అజయ్ దేవగణ్ ను కలవడం, ఇద్దరూ కలిసి, గేమ్ ఆఫ్ లైఫ్ ఆడడం, సిద్దార్థ్ తన తప్పులు సరిదిద్దుకునేందుకు అజయ్ మరొక గోల్డెన్ అపర్చ్యునిటీని ఇవ్వడం... ఈ సీరియస్ డ్రామాకు హిలేరియస్ ఫన్ ఎలిమెంట్స్ ను జోడించి, డైరెక్టర్ ఇంద్రకుమార్ సినిమాను చాలా బాగా పిక్చరైజేషన్ చేసారు.
భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 25వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
![]() |
![]() |