కొన్ని నిమిషాల క్రితమే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "మెగా 154" నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు పూజా కార్యక్రమంతో లాంఛనంగా మెగా 154 డబ్బింగ్ ఫార్మాలిటీస్ ను మొదలెట్టినట్టు తెలిపారు.
కే ఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్ లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మాస్ రాజా రవితేజ కీరోల్ పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
పోతే, ఈ దీపావళికి మెగా 154 టీం నుండి బిగ్ సర్ప్రైజ్ రాబోతున్నాయని టాక్. వచ్చే ఏడాది జనవరి ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.