కార్తీ, రాశిఖన్నా జంటగా PS మిత్రన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం "సర్దార్". తమిళ, తెలుగు భాషలలో అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకుంది.
సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చారు. 2 గంటల 45నిమిషాల సుదీర్ఘ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా దీపావళికి బాక్సాఫీస్ విన్నర్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రజిష విజయన్ మరొక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు GV ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. పోతే, తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.